
సాధించాను...!
నే విజయం సాధించాను...!
తనలో ఇన్నాళ్ళు దాగివున్న
ఇంకో భావాన్ని
బయటకు రప్పించా...!
తన కళ్ళ నుండి
జల జల రాలుతున్నాయి
కన్నీళ్ళు ...!
ఇది సత్యం..!
అమాయకమైన...
ఆ కళ్ళ నుండే...!
నాలో తపన అధికమౌతోంది...!
తను దూరమైతే తట్టుకునే శక్తి సన్నగిల్లుతోంది...!
ఏం చేయాలో తెలియడంలేదు...!
కళ కళ లాడే...
ఆ కళ్ళ నుండే...
కన్నీళ్ళు రాలాయి..!
కళ్ళలో కన్నీళ్ళు నిండినా కళ తగ్గలేదు..!
పెదవులపై చిరునవ్వు చెరగ లేదు...!
నవ్వుతూనే....
రాలుతున్నాయి....
కన్నీళ్ళు...!
ఎవరికోసమో...?
ఎందుకోసమో....?
09.02.09 6-30 సాయంత్రం
No comments:
Post a Comment