Saturday, May 16, 2009


గుండె...
గొంతుదాకా నిండింది...!
బయటపడలేక...
అక్కడే నిలిచిపోయింది...!
విముక్తి ఎప్పటికో...?
నిను చూసిన ప్రతిసారీ...
జారిపోతోన్న ....
నా హృదయాన్ని...
ఒడిసి పట్టుకుంటున్నాను.....ఒద్దికగా...!
వేదనతో మరిగి.... మరిగి......
కరిగి....కన్నీరవుతోంది...
నా హృదయం...!
అప్పుడప్పుడు...
తొణుకుతోంది....
పరిపూర్ణతతో...!

27.11.2008 6.56 సాయంత్రం

No comments:

Post a Comment