Friday, May 15, 2009



నిన్ను తలవని రోజు లేదు తెలుసా...?

నమ్మవు కదూ...!

చాలా మామూలుగా ఉండేవాడిని...!

కానీ...,ఇప్పుడు...

పరిస్థితి...

నా చేయి దాటిపోయింది...!

గుండె మరగటం తెలుసా...?

అనుభవిస్తున్నాను..!

ఈ రోజు... నీ ఎడమ కంటి క్రింద గాయం...,

అడగాలని...ఆశ..!

అలజడి..!

ఎన్నాళ్ళయ్యిందో...

నిన్ను చూసి...ప్రశాంతంగా..!

రోజూ ఎదురవుతున్నా...?

నువ్వంటే ఏమిటో తెలియదు...!?

కానీ...,

నువ్వుండాలి...!

నవ్వుతూ....,

సంతోషంగా...,

నిండు నూరేళ్ళు...!

నీ ఆనందం

నాకు పంచనక్కరలేదు...!

కానీ...,

నీ బాధను మాత్రం

పంచటం మరచిపోకు...!



 11.11.08 రాత్రి 10.05

No comments:

Post a Comment