Sunday, May 17, 2009



తనతో...నేను
మూడు భిన్నమైన అనుభూతులును
పొందాను.....స్పర్శలో...!
మంచులా చల్లనైన....!
రాయిలా కఠినమైన...!
చలి మంటలా వెచ్చనైన...!
ఏం చేయాలో తెలియని పరిస్థితి..!
కావాలి...తను నాక్కావాలి... మొత్తంగా!
ఎలా...?
అర్థంకాక అల్లాడిపోతున్నాను...!
తను చూసిన ఆ చూపును ఎలా అర్థం చేసుకోను..?
చూపులో ఆ బాధ..!
స్పర్శలో ఆ ఉద్వేగం...!
ఈ జన్మకి ఇంతేనేమో...?
ఏంటయ్యా...భగవంతుడా...?
ఈ..యాతన...?
ఏదోకటి చెయ్యి...!
వద్దులే...వదిలేయ్...ఈ జన్మకిలా..ఇది చాలు...!

18.03.09 10.47 రాత్రి

1 comment:

  1. ఏం చేయగలను నేస్తం !
    అర్ధం కాని నీ చూపును నెమరేసుకుంటూ ..
    నీ అడుగు జాడల్లో జ్ఞాపకాలనేరుకొంటూ ....
    రాబోయే ఉషోదయానికై ఎదురు చూడటం తప్ప !

    ReplyDelete