
నీ
ఛాయాచిత్రాలను
ప్రత్యేకంగా తీసుకోవాలా...?
అలా...వాటిని నా గది నిండా...
అలంకరించుకోవాలా...?
అవసరమా...?
నేను లేదంటాను...!
వేవేల నీ ఛాయాచిత్రాలు
నా మది నిండి వుంటే...
వేరే ఛాయాచిత్రాలు అవసరమా..?
ఎన్ని...?
ఒకటా....? రెండా...?
లెక్కలేనన్ని..
నీ రూపాలు...
నీ భావాలు...
నీ పలుకులు...
నా న్యూరాన్లలో...
భద్రపరచబడ్డాయి.....తెలుసా...!
ఈ జీవితానికి
నీ ఙాపకాలే....
నా ఊపిరిగా...
బ్రతికేస్తాను....!
23.01.09 6.35 సాయంత్రం
No comments:
Post a Comment