
నా శ్వాస మొదలై....
చాలా యేళ్ళైనా.....,
నీ ఉనికే లేదు....!
నీవు అణు మాత్రంగానైనా లేవు...!
నీ ఊపిరి గాలులు లేవు...!
నీ హృదయ లయలే లేవు.....!
అదేమి విచిత్రమోగానీ.....,
నీ శ్వాస మొదలై....
కొద్ది కాలమే అయినా.....,
నా హృదయ లయలు ఆగిపోయేట్టున్నాయి...!
నా ఊపిరి గాలులు వీచేట్టులేవు...!
నా అణువణువూ అదృశ్యమయ్యేట్టుంది...!
చివరికి.....,
నా ఉనికే ప్రశ్నార్ధకమౌతోంది కదూ....!
నన్ను నేనే కోల్పోతున్నాను........!
ఎందుకిలా జరుగుతోంది...?
నీకేమైనా తెలుసా....?
19.05.09 4.50 ప్రాతః సమయం
touching and go ahead
ReplyDeletemee kavitalu chala bagunnayi.abhi vyakti inka bagundi.baga sadhana cheyyandi,
ReplyDelete