
స్పర్శ
చల్లని నీ స్పర్శ...!
అనుభవిస్తున్నా...తొలిసారిగా...!
నీ చేతి వ్రేళ్ళు
స్పృశించగానే...
నా వ్రేళ్ళ కొనలలో మొదలై
హృదయాన్ని చేరిన తన్మయత్వం...!
క్షణకాలం పాటి
ఆ తన్మయత్వం...
శాశ్వతం కావాలని....!
ఏం వ్రాయాలో...తెలియటం లేదు...?
అసలేం కావాలో తెలిస్తేగా వ్రాయటానికి....?
అయినా...,కావాలి...!
మానవాతీతమైన
దివ్యత్వం...,
నిర్మలత్వం...,
తనలో చూడాలి...!
ఆశా...!
అత్యాశా?
13.11.08 10.29 రాత్రి
No comments:
Post a Comment