Sunday, May 31, 2009


ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట...!
నా నేస్తమొకరు చెప్పారు...!

నిజమేనా...?

నిజానిజాలు కాసేపు పక్కన పెడితే....,

ఈ మాటలో ఎంతోవుందనిపిస్తోంది....!

అదేదో....నా ఈ చిన్ని బుర్రకు అంతుచిక్కడం లేదు..!

కాస్త...ఆలోచించి సాయం చేయండి...!
ఏంటీ...?

ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట....!

మరీ...!

ఎప్పుడూ నిర్మలంగా వుంటూ.....

అప్పుడప్పుడూ...
మేఘావృతమై వుంటుందెందుకు........?

ప్రేయసికి దూరమౌతున్న ఒక ప్రేమికునిలా....!

ఎప్పుడూ ప్రశాంతంగా వుంటూ...,
అప్పుడప్పుడూ.....గర్జిస్తుందెందుకు.....?
కడుపు మండిన ఒక పేదవానిలా.....!

ఎప్పుడూ నీలంగా వుంటూ....,

అప్పుడప్పుడూ...
సప్తవర్ణాలను విరజిమ్ముతుందెందుకు...?

మన జీవితాలలోని సంతోషంలా....?

ఎప్పుడూ అందరికి ఆనందాన్ని పంచుతూ...,

అప్పుడప్పుడూ....
కొందరిలో విషాదాన్ని నింపుతుందెందుకు.....?

పక్షపాతి ప్రభువులా....!

నాకు తెలిసి....
తనూ మనలాగే.....!
విశాలమైన తన హృదయం నిండా
ఎన్నో నింపుకొని వుండొచ్చు......!

లేకపొతే.....ఎందుకిలా.....? ఏంటిలా....?
ఏంటి...?
ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట....!

నా నేస్తమొకరు చెప్పారు....!

నిజమేనా...?
01.06.09 11.34 ఉదయం

2 comments:

  1. నిజమే ! ఎక్కడైనా ఆకాశం ఒకేలా ఉంటుంది ....ఉన్నతంగా ...
    భగవంతునిలా .....
    మన హృదయంలోనే ...తేడా ...
    మన మనసు దుఃఖిస్తే మేఘావృతం
    కోపం ఘర్జన .....
    కరుణ కురిపిస్తే ....వర్షం ..
    ఆనందం ఆర్ణవమైతే ...అది
    ఇంద్రధనుస్సు !కాదంటారా ?
    మీ నేస్తంతో నేనూ ఏకీభవిస్తా !

    ReplyDelete
  2. ఎక్కడైనా ఆకాశం ఒకేలా వుంటుంది...
    మనం చూసే దాన్నిబట్టి మారుతుంటుంది...

    ReplyDelete