Monday, January 11, 2010



నీ

ప్రతీ

హృదయ స్పందన

నా

కోసమైతే....

ఎంత

బాగుంటుంది...!

Saturday, July 18, 2009





ఈ మధ్య...నీకు కన్నీళ్ళు ఎక్కువయ్యాయి...!

ఉత్తినే కన్నీళ్ళను కురిపిస్తున్నావ్...!

ప్రేమగా...!

నీకు బాధ కలిగితే మీ వాళ్ళను హత్తుకొన్నావ్...!

మరీ...నాకు బాధ కలిగితే ఎవరిని హత్తుకోవాలి..?

మా వాళ్ళనంటావా...!

నీ వల్ల కలిగే బాధైనా అంతేనా...?

కాదులే....ఇది నా వల్ల నాకు కలిగే బాధే...!

మీ నాన్న కళ్ళలో కన్నీళ్ళు కనిపించాయి కదా...!

ఇంకెవరి కన్నీళ్ళు కనిపించటం లేదా...!

పోనీలే...!

ఒకరి కన్నీళ్ళైనా కనిపించాయి ఆ గీత కళ్ళకు...!

నీకిప్పుడైనా ఒకరు దూరమైతే ఎలావుంటుందో తెలిసింది...!

కన్నీళ్ళే కాదు...!

కోపం కూడా ఎక్కువవుతోంది...!

ఎంత ముద్దుగా...

అందంగా...కోపగించుకొంటున్నావ్...!

ఏంటి దిష్ఠి తీయించుకొన్నవా...!

నా దిష్ఠి తగిలిందా....!

నీకు వేరే దిష్ఠి తీయడమెందుకు....?

ఆ దేవుడే నీకు రెండు దిష్ఠి చుక్కలు...

నీ కుడి పాదం మీది పుట్టు మచ్చలుగా...

అమ్మ కడుపులో ఉన్నప్పుడే పెట్టాడు కదా...!

వేరే దిష్ఠి ఎందుకు...!

ఆ దేవుడే నిన్ను ప్రేమగా చూసుకుంటున్నడానికి ఇది చాలు...!

తన బిడ్డకి తనే దిష్ఠి తీసిన తల్లిలా...!

ప్రేమగా...చూసుకొంటున్నాడు...!

కన్నీళ్ళుతో కంగారు పడకు...!

నీది దృఢ చిత్తం కదా...!

నీవు బండ రాయివి కదా...!

ఇంత సృష్ఠిని చూసుకొంటున్నాడు....!

నిన్ను చూసుకోవడం లేదని ఎందుకనుకొంటున్నావ్...?
చూసుకొంటున్నాడు అందరికన్నా మిన్నగా...!
మంచే జరుగుతుంది....!
ఉంటానిక....!
 16.07.09 మధ్యాహ్న్నం.





ఎదురు చూసావ్...!


ఈ రోజు...నువ్వు


నా కోసం ఎదురు చూసావ్...!


నా కోసం ఎదురుచూసావ్...!


కోవెలలో...!


చాలూ...!


ఈ జన్మకిది...!


ఆ దేవుని సన్నిధిలో...!


ఎదురు చూసావ్...!


ఊసులాడుకొన్నాం...!


ఎన్నో చెప్పావ్...!


ఎంతో విన్నావ్...!


ఈ జన్మకిది చాలూ...!


సంతోషంగా వుంటావ్...!


ఎదురు చూసావ్...!


ఒక దేహంతో...


రెండు కళ్ళతో మాత్రమే కాదు...!


నేను నిండిన మనస్సుతో...


ఎదురు చూసావ్...!


చాలు...!


ఈ ప్రాణానికిది...!


21.06.09 మధ్యాహ్న్నం.

Friday, July 17, 2009


నువ్వు దూరమై...

మరీ దగ్గరవుతున్నావు...!

కర్రికొండ నల్లబండ మీద...

నవ్వుతూన్న నీ రూపు...!

ప్రతిదినం నాకు అలవాటే...!

నిర్మలమైన ఆకాశంలోనూ...
నవ్వుతూన్న నీ మోమే కనిపిస్తోంది....!

బుట్టలో నీ క్యారియర్ లేని లోటు

స్పష్టంగా తెలుస్తోంది....!

గుర్తుకొస్తోంది...!

ప్రతీ క్షణం...నీ మాటే...!

ప్రతీ చోటా... నీ రూపే...!

నేనేమి కోల్పోయానో...

కోల్పోతున్నానో...

నాకిప్పుడు తెలుస్తోంది...!

ఇప్పుడు కూడా అదే దారిలో వస్తున్నా...!

అక్కడికే వస్తున్నా...!

అన్నీ అలాగే ఉన్నాయి...!

నా భావాలు మరియు బాధలు కూడా...!

ఒక్క నువ్వు తప్ప...!

ఏవీ ఆగటం లేదు...!

అన్నీ అలాగే జరిగి పోతున్నాయి...!

నువ్వు లేవని ఏవీ ఆగటం లేదు...!

ఒక్క నేను తప్ప...!

నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు
ప్రశాంతంగా చూడలేకపోయాను...!
నా భావం చూడనివ్వదు...!

ప్రశాంతంగా చూద్దామంటే నువ్వు ఎదురుగా లేవు...!
ఎక్కడో ఉన్నావ్...!

నాకేమి మిగిలింది...?

వెళ్తు వెళ్తూ వెనక్కి తిరిగి చూసిన

నీ చూపు తప్ప...!

ఐనా...

ఆ గీత కళ్ళలో...

ఏ భావాన్ని పట్టగలను...!
నాకు బుద్ధి లేదు కదా....!
 12.06.09 మధ్యాహ్నం 2.00

Sunday, May 31, 2009


ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట...!
నా నేస్తమొకరు చెప్పారు...!

నిజమేనా...?

నిజానిజాలు కాసేపు పక్కన పెడితే....,

ఈ మాటలో ఎంతోవుందనిపిస్తోంది....!

అదేదో....నా ఈ చిన్ని బుర్రకు అంతుచిక్కడం లేదు..!

కాస్త...ఆలోచించి సాయం చేయండి...!
ఏంటీ...?

ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట....!

మరీ...!

ఎప్పుడూ నిర్మలంగా వుంటూ.....

అప్పుడప్పుడూ...
మేఘావృతమై వుంటుందెందుకు........?

ప్రేయసికి దూరమౌతున్న ఒక ప్రేమికునిలా....!

ఎప్పుడూ ప్రశాంతంగా వుంటూ...,
అప్పుడప్పుడూ.....గర్జిస్తుందెందుకు.....?
కడుపు మండిన ఒక పేదవానిలా.....!

ఎప్పుడూ నీలంగా వుంటూ....,

అప్పుడప్పుడూ...
సప్తవర్ణాలను విరజిమ్ముతుందెందుకు...?

మన జీవితాలలోని సంతోషంలా....?

ఎప్పుడూ అందరికి ఆనందాన్ని పంచుతూ...,

అప్పుడప్పుడూ....
కొందరిలో విషాదాన్ని నింపుతుందెందుకు.....?

పక్షపాతి ప్రభువులా....!

నాకు తెలిసి....
తనూ మనలాగే.....!
విశాలమైన తన హృదయం నిండా
ఎన్నో నింపుకొని వుండొచ్చు......!

లేకపొతే.....ఎందుకిలా.....? ఏంటిలా....?
ఏంటి...?
ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట....!

నా నేస్తమొకరు చెప్పారు....!

నిజమేనా...?
01.06.09 11.34 ఉదయం

Friday, May 29, 2009


ఈ రోజు నీ పుట్టిన రోజు...!
ఈ రోజే నీ జీవితం మొదలైందంటావా..?
ఆవ గింజంత ఆకారంతో
అమ్మ కడుపులో
తొమ్మిది నెలల ముందే
మొదలైవుంటుంది నీ జీవితం...!
నమ్మవా...?
ఇది సత్యం....!
ఒడిదుడుకులు లేని
ఒద్దికైన జీవితం...!
మలినాలంటని మనస్సుతో....!
కల్మషాలంటని కాయంతో...!
హాయిగా...అమ్మ కడుపులో...!
అమ్మ జరాయువు
నీకు ఆయుష్షునిస్తే...,
నాన్న వాత్సల్యం నీ కళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది...!
ఎదుగుతున్నావ్....అందరి ప్రేమతో....!
ఎదగాలి.....!
అందరి ఎదసవ్వడిని ఏకంగా వింటూ....!
ఎవ్వరికీ అందనంత ఎత్తుగా...!
అభాగ్యులందరినీ ఆదుకునేంతగా...!
అందరి ఆకలి తీర్చేంతగా....!
అందరి కన్నీళ్ళు తుడిచేంతగా....!
అందరికి ప్రేమను పంచేంతగా...!
ఎదగాలి....ఆరోగ్యంగా...ఆనందంగా...!
నిండు నూరేళ్ళు...!
పుట్టిన రోజు శుభకాంక్షలు...!

30.05.09 ఉదయం 9.44

Wednesday, May 27, 2009


ఈ రోజు...
చాలా అమూల్యమైన వాటిని

కోల్పోయాను.......!

ఇక....నా...ఈ...జీవితంలో....వాటిని

తిరిగి...
పొందుతానన్న నమ్మకం లేదు...!
ఆ భగవంతునికి తెలియనిది
యేమీ లేదు...!
తనతో ఇవే
చివరి పలుకులేమో....!
తన ఫలితం
తనకు బాధను మిగిల్చినా...
తను మాత్రం అందరికీ ఆనందాన్ని పంచింది...!
తప్పో...? ఒప్పో...?

మనసుకు నచ్చింది చేసాను...!

ఆ దొడ్డ(పెద్ద) మనస్సు

ఈ చిన్ని హృదయాన్ని....

ద్వేషించినా సరే...?

ప్రేమించినా సరే.....?

ఎల్లప్పుడూ...

తన మంచిని కోరే.....!

తన ఆనందాన్ని
ఆస్వాదించే..........! ఏవి శాశ్వతం...?
భౌతిక రూపాలా....?

మానసిక ఙాపకాలా....?
ఏదేమైనా.....!?
నువ్వుండాలి....!

నిండు నూరేళ్ళు...!

ఆరోగ్యంగా....!
ఆనందంగా...!

ప్రకృతి
ఎంత నిత్యమో.....
నువ్వూ అంతే...!

నీ నవ్వూ.....అంతే...!

ఇక........................వుంటాను...!
 

 27.05.09 1.20 రాత్రి