Saturday, July 18, 2009





ఈ మధ్య...నీకు కన్నీళ్ళు ఎక్కువయ్యాయి...!

ఉత్తినే కన్నీళ్ళను కురిపిస్తున్నావ్...!

ప్రేమగా...!

నీకు బాధ కలిగితే మీ వాళ్ళను హత్తుకొన్నావ్...!

మరీ...నాకు బాధ కలిగితే ఎవరిని హత్తుకోవాలి..?

మా వాళ్ళనంటావా...!

నీ వల్ల కలిగే బాధైనా అంతేనా...?

కాదులే....ఇది నా వల్ల నాకు కలిగే బాధే...!

మీ నాన్న కళ్ళలో కన్నీళ్ళు కనిపించాయి కదా...!

ఇంకెవరి కన్నీళ్ళు కనిపించటం లేదా...!

పోనీలే...!

ఒకరి కన్నీళ్ళైనా కనిపించాయి ఆ గీత కళ్ళకు...!

నీకిప్పుడైనా ఒకరు దూరమైతే ఎలావుంటుందో తెలిసింది...!

కన్నీళ్ళే కాదు...!

కోపం కూడా ఎక్కువవుతోంది...!

ఎంత ముద్దుగా...

అందంగా...కోపగించుకొంటున్నావ్...!

ఏంటి దిష్ఠి తీయించుకొన్నవా...!

నా దిష్ఠి తగిలిందా....!

నీకు వేరే దిష్ఠి తీయడమెందుకు....?

ఆ దేవుడే నీకు రెండు దిష్ఠి చుక్కలు...

నీ కుడి పాదం మీది పుట్టు మచ్చలుగా...

అమ్మ కడుపులో ఉన్నప్పుడే పెట్టాడు కదా...!

వేరే దిష్ఠి ఎందుకు...!

ఆ దేవుడే నిన్ను ప్రేమగా చూసుకుంటున్నడానికి ఇది చాలు...!

తన బిడ్డకి తనే దిష్ఠి తీసిన తల్లిలా...!

ప్రేమగా...చూసుకొంటున్నాడు...!

కన్నీళ్ళుతో కంగారు పడకు...!

నీది దృఢ చిత్తం కదా...!

నీవు బండ రాయివి కదా...!

ఇంత సృష్ఠిని చూసుకొంటున్నాడు....!

నిన్ను చూసుకోవడం లేదని ఎందుకనుకొంటున్నావ్...?
చూసుకొంటున్నాడు అందరికన్నా మిన్నగా...!
మంచే జరుగుతుంది....!
ఉంటానిక....!
 16.07.09 మధ్యాహ్న్నం.





ఎదురు చూసావ్...!


ఈ రోజు...నువ్వు


నా కోసం ఎదురు చూసావ్...!


నా కోసం ఎదురుచూసావ్...!


కోవెలలో...!


చాలూ...!


ఈ జన్మకిది...!


ఆ దేవుని సన్నిధిలో...!


ఎదురు చూసావ్...!


ఊసులాడుకొన్నాం...!


ఎన్నో చెప్పావ్...!


ఎంతో విన్నావ్...!


ఈ జన్మకిది చాలూ...!


సంతోషంగా వుంటావ్...!


ఎదురు చూసావ్...!


ఒక దేహంతో...


రెండు కళ్ళతో మాత్రమే కాదు...!


నేను నిండిన మనస్సుతో...


ఎదురు చూసావ్...!


చాలు...!


ఈ ప్రాణానికిది...!


21.06.09 మధ్యాహ్న్నం.

Friday, July 17, 2009


నువ్వు దూరమై...

మరీ దగ్గరవుతున్నావు...!

కర్రికొండ నల్లబండ మీద...

నవ్వుతూన్న నీ రూపు...!

ప్రతిదినం నాకు అలవాటే...!

నిర్మలమైన ఆకాశంలోనూ...
నవ్వుతూన్న నీ మోమే కనిపిస్తోంది....!

బుట్టలో నీ క్యారియర్ లేని లోటు

స్పష్టంగా తెలుస్తోంది....!

గుర్తుకొస్తోంది...!

ప్రతీ క్షణం...నీ మాటే...!

ప్రతీ చోటా... నీ రూపే...!

నేనేమి కోల్పోయానో...

కోల్పోతున్నానో...

నాకిప్పుడు తెలుస్తోంది...!

ఇప్పుడు కూడా అదే దారిలో వస్తున్నా...!

అక్కడికే వస్తున్నా...!

అన్నీ అలాగే ఉన్నాయి...!

నా భావాలు మరియు బాధలు కూడా...!

ఒక్క నువ్వు తప్ప...!

ఏవీ ఆగటం లేదు...!

అన్నీ అలాగే జరిగి పోతున్నాయి...!

నువ్వు లేవని ఏవీ ఆగటం లేదు...!

ఒక్క నేను తప్ప...!

నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు
ప్రశాంతంగా చూడలేకపోయాను...!
నా భావం చూడనివ్వదు...!

ప్రశాంతంగా చూద్దామంటే నువ్వు ఎదురుగా లేవు...!
ఎక్కడో ఉన్నావ్...!

నాకేమి మిగిలింది...?

వెళ్తు వెళ్తూ వెనక్కి తిరిగి చూసిన

నీ చూపు తప్ప...!

ఐనా...

ఆ గీత కళ్ళలో...

ఏ భావాన్ని పట్టగలను...!
నాకు బుద్ధి లేదు కదా....!
 12.06.09 మధ్యాహ్నం 2.00

Sunday, May 31, 2009


ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట...!
నా నేస్తమొకరు చెప్పారు...!

నిజమేనా...?

నిజానిజాలు కాసేపు పక్కన పెడితే....,

ఈ మాటలో ఎంతోవుందనిపిస్తోంది....!

అదేదో....నా ఈ చిన్ని బుర్రకు అంతుచిక్కడం లేదు..!

కాస్త...ఆలోచించి సాయం చేయండి...!
ఏంటీ...?

ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట....!

మరీ...!

ఎప్పుడూ నిర్మలంగా వుంటూ.....

అప్పుడప్పుడూ...
మేఘావృతమై వుంటుందెందుకు........?

ప్రేయసికి దూరమౌతున్న ఒక ప్రేమికునిలా....!

ఎప్పుడూ ప్రశాంతంగా వుంటూ...,
అప్పుడప్పుడూ.....గర్జిస్తుందెందుకు.....?
కడుపు మండిన ఒక పేదవానిలా.....!

ఎప్పుడూ నీలంగా వుంటూ....,

అప్పుడప్పుడూ...
సప్తవర్ణాలను విరజిమ్ముతుందెందుకు...?

మన జీవితాలలోని సంతోషంలా....?

ఎప్పుడూ అందరికి ఆనందాన్ని పంచుతూ...,

అప్పుడప్పుడూ....
కొందరిలో విషాదాన్ని నింపుతుందెందుకు.....?

పక్షపాతి ప్రభువులా....!

నాకు తెలిసి....
తనూ మనలాగే.....!
విశాలమైన తన హృదయం నిండా
ఎన్నో నింపుకొని వుండొచ్చు......!

లేకపొతే.....ఎందుకిలా.....? ఏంటిలా....?
ఏంటి...?
ఎక్కడైనా ఆకాశం ఒకేలాగా వుంటుందట....!

నా నేస్తమొకరు చెప్పారు....!

నిజమేనా...?
01.06.09 11.34 ఉదయం

Friday, May 29, 2009


ఈ రోజు నీ పుట్టిన రోజు...!
ఈ రోజే నీ జీవితం మొదలైందంటావా..?
ఆవ గింజంత ఆకారంతో
అమ్మ కడుపులో
తొమ్మిది నెలల ముందే
మొదలైవుంటుంది నీ జీవితం...!
నమ్మవా...?
ఇది సత్యం....!
ఒడిదుడుకులు లేని
ఒద్దికైన జీవితం...!
మలినాలంటని మనస్సుతో....!
కల్మషాలంటని కాయంతో...!
హాయిగా...అమ్మ కడుపులో...!
అమ్మ జరాయువు
నీకు ఆయుష్షునిస్తే...,
నాన్న వాత్సల్యం నీ కళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది...!
ఎదుగుతున్నావ్....అందరి ప్రేమతో....!
ఎదగాలి.....!
అందరి ఎదసవ్వడిని ఏకంగా వింటూ....!
ఎవ్వరికీ అందనంత ఎత్తుగా...!
అభాగ్యులందరినీ ఆదుకునేంతగా...!
అందరి ఆకలి తీర్చేంతగా....!
అందరి కన్నీళ్ళు తుడిచేంతగా....!
అందరికి ప్రేమను పంచేంతగా...!
ఎదగాలి....ఆరోగ్యంగా...ఆనందంగా...!
నిండు నూరేళ్ళు...!
పుట్టిన రోజు శుభకాంక్షలు...!

30.05.09 ఉదయం 9.44

Wednesday, May 27, 2009


ఈ రోజు...
చాలా అమూల్యమైన వాటిని

కోల్పోయాను.......!

ఇక....నా...ఈ...జీవితంలో....వాటిని

తిరిగి...
పొందుతానన్న నమ్మకం లేదు...!
ఆ భగవంతునికి తెలియనిది
యేమీ లేదు...!
తనతో ఇవే
చివరి పలుకులేమో....!
తన ఫలితం
తనకు బాధను మిగిల్చినా...
తను మాత్రం అందరికీ ఆనందాన్ని పంచింది...!
తప్పో...? ఒప్పో...?

మనసుకు నచ్చింది చేసాను...!

ఆ దొడ్డ(పెద్ద) మనస్సు

ఈ చిన్ని హృదయాన్ని....

ద్వేషించినా సరే...?

ప్రేమించినా సరే.....?

ఎల్లప్పుడూ...

తన మంచిని కోరే.....!

తన ఆనందాన్ని
ఆస్వాదించే..........! ఏవి శాశ్వతం...?
భౌతిక రూపాలా....?

మానసిక ఙాపకాలా....?
ఏదేమైనా.....!?
నువ్వుండాలి....!

నిండు నూరేళ్ళు...!

ఆరోగ్యంగా....!
ఆనందంగా...!

ప్రకృతి
ఎంత నిత్యమో.....
నువ్వూ అంతే...!

నీ నవ్వూ.....అంతే...!

ఇక........................వుంటాను...!
 

 27.05.09 1.20 రాత్రి

Monday, May 18, 2009


నా శ్వాస మొదలై....
చాలా యేళ్ళైనా.....,
నీ ఉనికే లేదు....!
నీవు అణు మాత్రంగానైనా లేవు...!
నీ ఊపిరి గాలులు లేవు...!
నీ హృదయ లయలే లేవు.....!
అదేమి విచిత్రమోగానీ.....,
నీ శ్వాస మొదలై....
కొద్ది కాలమే అయినా.....,
నా హృదయ లయలు ఆగిపోయేట్టున్నాయి...!
నా ఊపిరి గాలులు వీచేట్టులేవు...!
నా అణువణువూ అదృశ్యమయ్యేట్టుంది...!
చివరికి.....,
నా ఉనికే ప్రశ్నార్ధకమౌతోంది కదూ....!
నన్ను నేనే కోల్పోతున్నాను........!
ఎందుకిలా జరుగుతోంది...?
నీకేమైనా తెలుసా....?

 19.05.09 4.50 ప్రాతః సమయం


Sunday, May 17, 2009



కన్నీళ్ళతో  తడిసిన కళ్ళే....
ఈ ప్రపంచాన్ని...
చాలా స్పష్టంగా...
చూడగలుగుతాయి...........!
ఇది నా మాట కాదు..!
ఎవరో చెప్పారు..?
ఇది అక్షర సత్యమే కాదు...!
ఇది జీవిత సత్యం.....!
అలాగే...!
ఇతరులకై కనుజారే.... 
కన్నీరే ఆనందమానందం...!
నిజం..!
మనకోసం పడే బాధలో ఏముంది...! 
ఇతరులకై పడే బాధలోనే వుంది...
అనంతమైన సంతృప్తి.....!  

 03.03.09 8.58 రాత్రి 


తనతో...నేను
మూడు భిన్నమైన అనుభూతులును
పొందాను.....స్పర్శలో...!
మంచులా చల్లనైన....!
రాయిలా కఠినమైన...!
చలి మంటలా వెచ్చనైన...!
ఏం చేయాలో తెలియని పరిస్థితి..!
కావాలి...తను నాక్కావాలి... మొత్తంగా!
ఎలా...?
అర్థంకాక అల్లాడిపోతున్నాను...!
తను చూసిన ఆ చూపును ఎలా అర్థం చేసుకోను..?
చూపులో ఆ బాధ..!
స్పర్శలో ఆ ఉద్వేగం...!
ఈ జన్మకి ఇంతేనేమో...?
ఏంటయ్యా...భగవంతుడా...?
ఈ..యాతన...?
ఏదోకటి చెయ్యి...!
వద్దులే...వదిలేయ్...ఈ జన్మకిలా..ఇది చాలు...!

18.03.09 10.47 రాత్రి

తను
ముగ్గురికి కృతఙతలు
తెలియజేయాలి...!
ఒకరు...అమ్మ..1
అంత చక్కని నవ్వునిచ్చినందుకు...!
ఇంకొకరు....నాన్న...!
అంతటి సంస్కారం నేర్పినందుకు..!
చివరివారు...ఆ సర్వేశ్వరుడు...!
ఇంతటి జన్మనిచ్చినందుకు...!
నేనైతే...నలుగురికి...?
ఆ ముగ్గురితోపాటు....తనకి...!
తన కన్నీళ్ళు...
నాలోని కల్మషాలన్నింటినీ
ఒక్కొక్కటిగా పారద్రోలుతున్నాయి....!
తన కంట కన్నీరొలకడం...
చూశాను....తొలిసారిగా...!

 10.02.09 6.51 సాయంత్రం


నీ నీడను తాకలేక పోయాను..!
ఇక...నిన్నెలా తాకుతాననుకున్నావ్...?
నీ ప్రతిబింబాన్ని బంధించలేకపోయాను...!
ఇక...నిన్నెలా నా బాహులలో బంధిస్తాననుకున్నావ్...?
చివరికి తెలుసుకున్నాను...!
నీ మనస్సును మాత్రమే తాకగలనని....!
నీ హృదయాన్ని మాత్రమే బంధించగలనని....!
నేను చిన్నోన్ని కాదుగా...!?
అందుకే ఇవి సాధ్యం...!

 03.03.09 8.58 రాత్రి


సాధించాను...!
నే విజయం సాధించాను...!
తనలో ఇన్నాళ్ళు దాగివున్న
ఇంకో భావాన్ని
బయటకు రప్పించా...!
తన కళ్ళ నుండి
జల జల రాలుతున్నాయి
కన్నీళ్ళు ...!
ఇది సత్యం..!
అమాయకమైన...
ఆ కళ్ళ నుండే...!
నాలో తపన అధికమౌతోంది...!
తను దూరమైతే తట్టుకునే శక్తి సన్నగిల్లుతోంది...!
ఏం చేయాలో తెలియడంలేదు...!
కళ కళ లాడే...
ఆ కళ్ళ నుండే...
కన్నీళ్ళు రాలాయి..!
కళ్ళలో కన్నీళ్ళు నిండినా కళ తగ్గలేదు..!
పెదవులపై చిరునవ్వు చెరగ లేదు...!
నవ్వుతూనే....
రాలుతున్నాయి....
కన్నీళ్ళు...!
ఎవరికోసమో...?
ఎందుకోసమో....?

 09.02.09 6-30 సాయంత్రం


నీ
ఛాయాచిత్రాలను
ప్రత్యేకంగా తీసుకోవాలా...?
అలా...వాటిని నా గది నిండా...
అలంకరించుకోవాలా...?
అవసరమా...?
నేను లేదంటాను...!
వేవేల నీ ఛాయాచిత్రాలు
నా మది నిండి వుంటే...
వేరే ఛాయాచిత్రాలు అవసరమా..?
ఎన్ని...?
ఒకటా....? రెండా...?
లెక్కలేనన్ని..
నీ రూపాలు...
నీ భావాలు...
నీ పలుకులు...
నా న్యూరాన్లలో...
భద్రపరచబడ్డాయి.....తెలుసా...!
ఈ జీవితానికి
నీ ఙాపకాలే....
నా ఊపిరిగా...
బ్రతికేస్తాను....!

 23.01.09 6.35 సాయంత్రం

Saturday, May 16, 2009


ఎవరిలోనైనా....
ఏం కావాలి...?
చెరగని చిరునవ్వు...!
అందరూ చెప్పేదే కదా...!
అని అనుకుంటున్నారా..!
కాదండీ...!
ఇది సత్యం..!
ఇన్ని రోజుల ఈ పరిచయంలో
ఏనాడూ.... తనని ఇంకో విధంగా..
చూల్లేదు...!
ఎప్పుడూ చదువుతూ....
ఎల్లప్పుడూ చిరునవ్వుతో...
సమాధనమిస్తూ... తప్ప...!
తన తలపులతోనే...
తల నిండిపోతోంది...!
ఏం...చేయాలో తెలియక
తికమకపడుతోంది......హృదయం...,
ఆశతోనో...! అత్యాశతోనో...?

 06.02.09 10.45 రాత్రి

నేర్చుకుంటున్నాను...!
నిన్ను చూసిన దగ్గరనుండి...
రోజుకో పాఠం...!
జీవిత పాఠం...!
నీ ప్రతీదీ నాకు ఆరాధ్యమే...!
ఆమోదమే...!
నీ దృఢ చిత్తం...!
నీ పలకరింపు...!
నీ ఉదార స్వభావం...!
నీ గ్రహణ శక్తి...!
ఇలా... అన్నీ....ఆరాధ్యమే...!

25.11.2008 10.24 రాత్రి



బాధ కలిగింది...,
మొదటిసారిగా నీ వల్ల...!
ఎందుకో..?
నిందిస్తున్నాను కదూ..!
నీ వల్లే....ముమ్మాటికీ...నీ వల్లే..!
నీ నుండి దూరంగా...,
నే వేసే...
ప్రతీ అడుగూ...
నాకు నరకప్రాయమే...!
నిన్ను
నా నుండి
దూరం చేసే..
నా ప్రతీ అడుగూ...
నాకు గురుతే...!
నన్ను కదపకు...!
ఏ క్షణంలోనైన...
ఒలికి పోగలను...!
వదిలేయ్.....
నన్నిలా....!

06.12.08 11.45 రాత్రి

నువ్వు...
నా తోడుండాలి...!
ఈ దేహం...
మన్నయ్యేంత వరకు...!
నా అక్షర దోషాలనే కాదు...,
నా అణువణువునూ...
నువ్వు సరిచేయాలి...!
నీ అనంతమైన ప్రేమతో....!
నాకు
కొడంత ధైర్యంవస్తోంది...
నువ్వు
నా తోడుంటే...!
ఆ ఊహే...
వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది..!
వుంటావుగా....
నువ్వు నా తోడుగా...
నా తుది శ్వాస వరకు...!

29.11.08 11.21

గుండె...
గొంతుదాకా నిండింది...!
బయటపడలేక...
అక్కడే నిలిచిపోయింది...!
విముక్తి ఎప్పటికో...?
నిను చూసిన ప్రతిసారీ...
జారిపోతోన్న ....
నా హృదయాన్ని...
ఒడిసి పట్టుకుంటున్నాను.....ఒద్దికగా...!
వేదనతో మరిగి.... మరిగి......
కరిగి....కన్నీరవుతోంది...
నా హృదయం...!
అప్పుడప్పుడు...
తొణుకుతోంది....
పరిపూర్ణతతో...!

27.11.2008 6.56 సాయంత్రం


ఈ రోజుకు

ఒక ప్రత్యేకత వుంది.

అదేంటో తెలుసా?

ఈ మోమును....

చూసి...

యేడాది కావస్తోంది..!

అంతా మట్టే...!

రాబోయే తరాలకు

మనమందించే

మంచి జీవన విధానం తప్ప..!

అదీనూ...ఆదరించే వారుంటేనే...?

పొంతన లేదు కదూ..!

అది అంతే..!

పరిస్థితి అలావుంది మరి...!


 22.11.08 10.56 రాత్రి

Friday, May 15, 2009



స్పర్శ

చల్లని నీ స్పర్శ...!

అనుభవిస్తున్నా...తొలిసారిగా...!

నీ చేతి వ్రేళ్ళు

స్పృశించగానే...

నా వ్రేళ్ళ కొనలలో మొదలై

హృదయాన్ని చేరిన తన్మయత్వం...!

క్షణకాలం పాటి

ఆ తన్మయత్వం...

శాశ్వతం కావాలని....!

ఏం వ్రాయాలో...తెలియటం లేదు...?

అసలేం కావాలో తెలిస్తేగా వ్రాయటానికి....?

అయినా...,కావాలి...!

మానవాతీతమైన

దివ్యత్వం...,

నిర్మలత్వం...,

తనలో చూడాలి...!

ఆశా...!

అత్యాశా?

 13.11.08 10.29 రాత్రి


జాబిలివి

అని

నేనంటాను...!

కాదంటావా...?

ఏం...ఎందుకంటవా?

నేల మీద ఉన్నానంటావా...!

అందుకే...,

నింగిలోని

ఆ జాబిలైనా...అందుతుంది...!

కానీ...

నేల మీది ఈ జాబిలి...

అందదు కదా..!

నిందిస్తున్నానంటావా..!

రా....!

నా....ఈ....వేదనతో...,

ఆలోచించు...!

నీకే తెలుస్తుంది...?!

సాలీడులా...

నా మది చుట్టూ...

నీ...

ఆలోచనల గూడును

అల్లుకున్నాను....!

తెలుసా...!

బయట పడలేక...,

నిను చేరలేక...,

అనుభవిస్తున్నా....

తీయని యాతన...!


13.11.08 7.37 ఉదయం


నిన్ను తలవని రోజు లేదు తెలుసా...?

నమ్మవు కదూ...!

చాలా మామూలుగా ఉండేవాడిని...!

కానీ...,ఇప్పుడు...

పరిస్థితి...

నా చేయి దాటిపోయింది...!

గుండె మరగటం తెలుసా...?

అనుభవిస్తున్నాను..!

ఈ రోజు... నీ ఎడమ కంటి క్రింద గాయం...,

అడగాలని...ఆశ..!

అలజడి..!

ఎన్నాళ్ళయ్యిందో...

నిన్ను చూసి...ప్రశాంతంగా..!

రోజూ ఎదురవుతున్నా...?

నువ్వంటే ఏమిటో తెలియదు...!?

కానీ...,

నువ్వుండాలి...!

నవ్వుతూ....,

సంతోషంగా...,

నిండు నూరేళ్ళు...!

నీ ఆనందం

నాకు పంచనక్కరలేదు...!

కానీ...,

నీ బాధను మాత్రం

పంచటం మరచిపోకు...!



 11.11.08 రాత్రి 10.05

Thursday, May 14, 2009





మనలోని ప్రాణం అమ్మ
మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ...!


తను
ముగ్గురికి కృతఙతలు
తెలియజేయాలి...!
ఒకరు...అమ్మ..1
అంత చక్కని నవ్వునిచ్చినందుకు...!
ఇంకొకరు....నాన్న...!
అంతటి సంస్కారం నేర్పినందుకు..!
చివరివారు...ఆ సర్వేశ్వరుడు...!
ఇంతటి జన్మనిచ్చినందుకు...!
నేనైతే...నలుగురికి...?
ఆ ముగ్గురితోపాటు....తనకి...!
తన కన్నీళ్ళు...
నాలోని కల్మషాలన్నింటినీ
ఒక్కొక్కటిగా పారద్రోలుతున్నాయి....!
తన కంట కన్నీరొలకడం...
చూశాను....తొలిసారిగా...!

 10.02.09 6.51 సాయంత్రం

Wednesday, April 15, 2009

THE VALUES

THE BEST
AND
THE MOST BEAUTIFUL THINGS
IN THIS WORLD CAN'T BE SEEN
AND
EVEN TOUCHED.
THEY MUST BE FELT
WITH THE HEART ONLY
...!
ఈ అనంత సృష్టిలోని...
అందమైన మరియు ఉత్తమమైన...

వాటిని...
కళ్ళతో చూడలేము...!

చేతితో తాకలేము...!

కేవలం...,

హృదయంతో మాత్రమే...

స్పృశించగలము....!

Tuesday, April 14, 2009

only feelings....!




నిన్న...!
నేనున్నచోట నీవు...!
నీవున్నచోట నేను...!
నేడు...!
నీవున్నచోట నేను...!నేనున్నచోట నీవు...!
నిన్న...!నీలా నేను...!
నేడు...!
నాలా నీవు...!
రేపు...!
ఒకేచోట.....,ఒకేలా.......,
మనమిరువురం.......!
















Saturday, April 11, 2009

THE TEARS






I saw the tears...!
These are not the tokens of sorrows only...!
These are not the signs of cheers only...!
These are not only tears...!
These are the precious drops of feelings fallen from the t ender heart...!
These are not only tears...!
These are the memories collected over the years...!